పునరావాసం కల్పించాలంటూ గ్రామస్తులు ఆవేదన

రంపచోడవరం      ముచ్చట్లు :
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు ఎగువ నుంచి తరుముకొస్తున్న గోదావరి ప్రమాదకరంగా మారిందని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. మండలంలో 38 గ్రామాలు  నీట మునిగే పరిస్థితి ఉందని 15 వేల మంది   పైగా నిరాశ్రయులయ్యారని తెలియజేశారు. ఈ గ్రామంలో 318 మంది కుటుంబాలు ఉండగా కొందరిని మాత్రమే గుర్తించి ఈ గ్రామం నందు నివసించే 75 శాతం మందిని పై తగిన అర్హతలు ఉన్నా కక్ష సాధింపు చర్యగా అధికారులు ఇక్కడ నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు  జారీ చేయడంపై చిన్న పిల్లలతో, వృద్ధులతో,వికలాంగులతో ఈ గ్రామాన్ని విడిచి ఎటు పోవాలని గ్రామస్థులు వారి గోడు వినిపించారు. సుమారు 14 వందల మీటర్ల పొడవు,35 మీటర్ల ఎత్తున నిర్మాణం చేపట్టే కాపర్ డ్యాం ను నివాసిత కుటుంబాలకు  పునరావాస కాలనీల నిర్మాణం,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను ఇచ్చిన తర్వాతే కాపర్ డ్యాం నిర్మాణాలు చేపడితే బాగుంటుందని గ్రామస్తులు తెలియజేసినా అధికారులు వినలేదని వారంటున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగకుండానే ప్యాకేజీకి అర్హత కలిగిన వారిని ఇక్కడ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదని మమ్మల్ని మనుషులుగా గురించి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి నవరత్నాలలో భాగంగా అర్హత కలిగిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను ఇచ్చి ఈ గ్రామ ప్రజలను పంపించాలని నియోజకవర్గ ప్రభుత్వ నాయకులకు,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు హక్కుల ఉల్లంఘనగా చేసే అధికారుల తీరుపై ఈ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:The villagers are aware of the need to rehabilitate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *