Natyam ad

వలంటీర్ల వ్యవస్థ ప్రశంసనీయం- బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్లు ప్రజలకు ఎంతో సేవలు అందించారని , వారిని ప్రశంసిస్తున్నామని బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ తెలిపారు. గురువారం ఆయన పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పార్టీ తరపున నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థ అద్భుతమైన సేవలు అందిస్తోందన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 60 వేల మంది వలంటీర్లచే రాజీనామాలు చేయించి స్వార్థం కోసం వినియోగించుకునేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. దీనిని అడ్డుకునేందుకే హైకోర్టులో వలంటీర్ల రాజీనామాలు ఆమోదించరాదని రిట్‌పిటీషన్‌ దాఖలు చేశామన్నారు.

 

Post Midle

Tags: The volunteer system is commendable – BCY Party President Ramachandra Yadav

 

Post Midle