17 లోపు ఓటర్ల కులగణన పూర్తి చేయాలి

The voter caste under 17 should be completed

The voter caste under 17 should be completed

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:13/01/2020

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్నందు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటి పరిధిలో కుల గణన ఓటర్ల జాబితా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ మున్సిపల్‌ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటిలో ఎస్సీ, ఎస్టీ , బీసీ , మహిళా ఓటర్ల గణన కార్యక్రమం 17లోపు పూర్తి చేయాలన్నారు. ప్రతి వార్డులోను ఇంటింటికి వెళ్లి గణనలో ఎలాంటి సందేహాలు ఉన్నా తెలుసుకోవాలన్నారు. అలాగే సరైన సమాచారం ఇవ్వకపోతే వారి ఇంటిలోని పిల్లల రికార్డులను పరిశీలించి నమోదు చేయాలన్నారు. కమిషన్‌ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ , మహిళా ఓటర్లను ఆయా రంగుల కలిగిన పెన్నులతో మార్కు చేయాలన్నారు. 17కు పూర్తి చేసి, 18న కార్యాలయంలో తుదిజాబితా సిద్దం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీలు, వలంటీర్లు, మున్సిపల్‌ సిబ్బంది, అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా సంబంధిత గణన అధికారులపై చర్యలు తప్పదన్నారు.

మున్సిపాలిటిలో సంక్రాంతి సందడి

Tags: The voter caste under 17 should be completed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *