ప్లాస్టిక్‌ కవర్లపై యుద్ధం

The war on plastic covers

The war on plastic covers

– కమిషనర్‌ వర్మ

Date:14/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు, వినియోగంపై మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో సిబ్బంది కొరడ జులిపించారు. ఆదివారం ఇందులో బాగంగా రహస్యంగా ప్లాస్టిక్‌ విక్రయాలు, వినియోగంపై నిఘా ఏర్పాటు చేసి, పలువురికి జరిమానా విధించారు. అలాగే మురుగునీటి కాలువల్లో , కౌండిన్యనదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ కవర్లను తీసి కంపోస్ట్యార్డుకు తరలించే కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్‌ కార్మికులందరు ఒక్కసారిగా మురుగునీటి కాలువల్లో నీటిని, ప్లాస్టిక్‌ కవర్లను తొలగించే కార్యక్రమం చేపట్టడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాలువలు, గట్టులు ప్రాంతాల్లో పగలు ఫాగింగ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ మున్సిపాలిటిలో పర్యావరణ కాలుష్యానికి విఘాతం కలిగిస్తూ ప్లాస్టిక్‌ కవర్ల విక్రయదారుల జాబితాలు సిద్దం చేశామన్నారు. వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, అరె స్ట్లు చేయిస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లే విధంగా ఏలాంటి విక్రయాలు చేపట్టినా సహించేది లేదన్నారు. మున్సిపాలిటిలో సిబ్బంది కొరత ఉన్నందున డెప్యూటేషన్‌పై సిబ్బందిని ఇతర మున్సిపాలిటిల నుంచి తీసుకొచ్చేందుకు నివేదికలు సిద్దం చేసి, డిఎంఏకు పంపుతున్నామన్నారు. ఈనెలాఖరులోపు మున్సిపాలిటిలో పారిశుద్ధ్యం , పర్యావరణ కాలుష్య నివారణ పూర్తి స్థాయిలో చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌, కార్మిక సంఘ నాయకుడు శ్రీరాములు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరం

Tags: The war on plastic covers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *