హంద్రనీవా నీరు రైతులకు అందకుండ ఇంకిపోతుంది

The water of Hendranwa is in the hands of the farmers

– ఓట్ల కోసం బాబు నీరుపారించే యత్నం
– పడమటి మండలాల్లో బాబు మోసం
– పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎద్దెవా

 

Date:12/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు కాలువలో నీటిని వదలకుండ రైతులను ఏమారించేందుకు నీరు పారించేయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టారని, హంద్రీనీవా నీరు కాలువల్లోనే ఇంకిపోతోందని తంబళ్లపల్లె వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎద్దెవా చేశారు. మంగళవారం ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, పార్టీ నేతలతో ద్వారకనాథరెడ్డి సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడమటి మండలాల్లోని రైతులను ఆదుకునేందుకు రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ప్రాజెక్టును తాను చేపట్టినట్లు సీఎం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి రైతాంగాన్ని మరోసారి మోసం చేసేందుకు హంద్రీనీవా కాలువలో క్రిష్ణాజలాల తరలింపు నాటకానికి తెరతీశారన్నారు. చంద్రబాబు నాటకంలో పడమటి మండలాల్లోని తెలుగుదేశం నాయకులు నటి ంచే కార్యక్రమం చేపట్టి, కాలువలకు పూజలు చేసి, రైతులను, ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే హంద్రీనీవా కాలువలో సరిపడ నీటిని విడుదల చేయాలని డిమాండు చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలను కాపి కొట్టి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మోసగించే కార్యక్రమం చేపట్టారన్నారు. గత ఐదేళ్లుగా పేదల సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబునాయుడు నేడు పెన్షన్లు, నిరుద్యోగభృతి, పసుపు, కుంకుమ క్రింద ఆడపడచులకు చెక్కులు పంపిణీ చేయడం హాస్యాస్పదమన్నారు. మహిళల పట్ల గౌరవం ఉంటే చెక్కులు మూడు విడతలుగా కాకుండ ఒకే సారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండు చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. దీనిని చూసి ముఖ్యమంత్రికి గుబులు పుట్టిందన్నారు. రాష్ట్ర రాజకీయాలు మారుతుండటంతో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యేక హ్గదా అంటు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం, నల్ల దుస్తులు ధరించి, నాటకాలు వేస్తూ, తెరపైకి ప్రత్యేకహ్గదాను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు ఎన్ని డ్రామాలు వేసినా ఈ సారి ప్రజలు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప, జెడ్పిటీసీ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపిపి అంజిబాబు, పట్టణ బూత్‌ కమిటి కన్వీనర్‌ అమ్ము, పార్టీ నేతలు విజయభాస్కర్‌రెడ్డి, హేమంత్‌, అస్లాంమురాది, అయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంఆర్‌పిఎస్‌ ఛలో అమరావతి కరపత్రాలు విడుదల

 

Tags: The water of Hendranwa is in the hands of the farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *