The waters of Krishnamma reach the Nethigutpalli pump house in Punganur zone

పరవల్లు తొక్కుతున్న క్రిష్ణమ్మ జలాలు

– నేతిగుట్లపల్లె పంపుహౌస్‌కు చేరుకున్న హంద్రీనీవా జలాలు
– హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం

Date:16/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా హంద్రీనీవా కాలువ ద్వారా రైతులకు సాగునీరు-తాగునీరు ఇవ్వాలని 2007 సంవత్సరంలో కాలువలు ఏర్పాటు చేశారు. క్రిష్ణమ్మ జలాలు సముద్రంలోని కలువకుండ ఆ నీటిని రైతులకు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆనాడు ఆయన కన్న కలలు నేటి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సహకారం చేస్తున్నారు. ఈ క్రమంలో మదనపల్లె సమీపంలోని చిప్పిలి రిజర్వాయర్‌ నుంచి పుంగనూరు కెనాల్‌కు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు మళ్లీంచారు . ఈనేపధ్యంలో గురువారం పుంగనూరు మండలంలోని నేతిగుట్లపల్లె పంపుహౌస్‌ వద్దకు క్రిష్ణమ్మ జలాలు పరవల్లు తొక్కుతున్నాయి. ఈ విషయం ఆనోటాఈనోటా పడి దావాణలంలా వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా కాలువగట్ల వద్దకు చేరుకు క్రిష్ణమ్మ జలాల ప్రవాహాన్ని వీక్షిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పుంగనూరు పట్టణ సమీపంలోని పుంగమ్మ చెరువులో ఏర్పాటు చేసిన సమ్మర్‌స్టోరేజ్‌కు నీరు చేరుకుంటాయని ప్రజలు ఆనందానికి అవదలు లేకుండ ఉన్నాయి. సమ్మర్‌స్టోరేజ్‌కు నీరు చేరడంతో పాటు పట్టణ ప్రజలు శాశ్వత దాహర్తి తీరుతుందని ఆశబావం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. .

మంత్రులను కలిసిన అమరావతి ప్రజలు

Tags: The waters of Krishnamma reach the Nethigutpalli pump house in Punganur zone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *