తెలంగాణ లో రైతుల జీవన విధానం మారింది…

జగిత్యాల ముచ్చట్లు

ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో రైతుల జీవన విధానం మారిందని జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.శుక్రవారం జగిత్యాల అర్బన్ మండల హాస్నా బాద్ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో హాస్నాబాద్ గ్రామ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మరియు వారి అనుచరులు టీఆరెఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి వారిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రజా స్వామ్యం లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అమలు చేయడం ప్రజా ప్రతినిధులు, నాయకులు పాత్ర అని అన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల రైతులు వ్యవసాయం తో పాటు, అనుబంధ వృత్తి చేపడుతూ ఆదాయం పొందుతున్నారని ,రాత్రి వేలలో కుటుంబం తో గడుపు తున్నారని, గతంలో ఈ పరిస్థితి ఉండేదా అని,ఇంకా రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డురమని అన్నారు..  రైతులు జీవన విధానంలో మార్పు సుస్పష్టం అని రైతులే అన్నారని అన్నారు.రైతుల కోసం రైతు బంధు,రైతు భీమా,ధరణి,కొత్త పాస్ పుస్తకాల పంపిణీ,సకాలం లో ఎరువుల పంపిణీ,
కాళేశ్వరం,మిషన్ కాకతీయ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
రాష్ట్రం లో ప్రతి పల్లె ప్రగతి పథం లో దూసుకుపోతున్న విషయం ప్రజలకు తెలుసునని,పల్లె ప్రకృతి వనం,వైకుంఠ దామం,కంపోస్టు షెడ్డు,హరిత హారం,ట్రాక్టర్ టాంకర్ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా
రూపాయి విలువ తగ్గింది అని,ప్రపంచంలో భారత్ విలువ కూడా తగ్గిందని ఒక ఉదాహరణ అని అన్నారు.
రాష్ట్రంలో అన్ని కులాలకు మతాలకు అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని కొన్ని పార్టీలు ప్రజలను యువతను రెచ్చగొట్టి కులమత రాజకీయాలు చేస్తున్నారని ముందు రాష్ట్రంలో పేదరిక ,నిరుద్యోగ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉందని ఆ విధంగా పనిచేయాలని ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని అభివృద్ధి చేసే ముందు ఆటంకం కలిగించ కూడదని ఈ సందర్భంగా కోరారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలో 12 వ పెద్ద రాష్ట్రం అని జీఎస్టీ చెల్లింపులో మాత్రం నాలుగవ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లో ఒక రూపాయలో 60 పైసలు మాత్రమే వస్తున్నాయని ఆ నిధుల విషయంలో కూడా కేంద్రం జాప్యం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్,మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు,సర్పంచ్ లక్ష్మణ్ రావు,ఎంపీటీసీ మల్లా రెడ్డి,రైతు బందు మండల కన్వీనర్ శంకర్,ఎస్టీ విభాగం అధ్యక్షులు శ్రీరామ్ బిక్ష పతి,పార్టీ ఉపాద్యక్షులు గంగాధర్,అర్బన్ మండల పార్టీ సంయుక్త కార్యదర్శి నరేందర్ రావు,నాయకులు వెంకట్ రావు,నాగరాజు,అంజి,రవి, అజయ్,తదితరులు పాల్గొన్నారు.

Tags:The way of life of farmers in Telangana has changed…

Leave A Reply

Your email address will not be published.