వివేకానందుని మార్గం-విశ్వానికి అనుసరణీయం -విశ్వజ్ఞాని వివేకానందుడు
పెద్దపంజాణి ముచ్చట్లు:
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నాగిరెడ్డిపల్లి నందు స్వామి వివేకానందుని జయంతి పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం ప్రధానోపాధ్యాయులు బాబురెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలో వివేకానందుని చిత్రానికి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా బాబురెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావి విశ్వానికి విజ్ఞానాన్ని అందించిన విశ్వజ్ఞాని అని కొనియాడుతూ వివేకానందుని ప్రసంగాలు అంతర్జాతీయ స్థాయిలో మేథావులని మంత్రముగ్ధులను చేశాయి అన్నారు.స్థానిక సచివాలయ ఉద్యోగి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ గ్రామాన వివేకానందుని ఆలోచనలకు ఆశయాలకు ప్రతిరూపాలైన వారసులున్నారని గ్రామ స్వరాజ్యం విజ్ఞానం తో విలసిల్లుతోందని అన్నారు.కార్యక్రమంలో గ్రామ యువకులు,విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The Way of Wisdom-Applicable to the Universe-The Scientologist Wisdom