క్రిస్మస్ కు వారం, సంక్రాంతికి పది రోజులు

Date:14/12/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ ప్రభుత్వం క్రిస్మస్, సంక్రాంతి సెలవుల షెడ్యూల్ విడుదల చేసింది. రెండు పండుగలకు సంబంధించి.. విద్యాసంస్థలకు సెలవు దినాలను ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ వచ్చేసింది.. అలాగే ఇంటర్ బోర్డ్ కూడా సెలవుల షెడ్యూల్ విడుదల చేసింది. అందులో క్రిస్మస్‌కు పండుగ సందర్భంగా.. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ఉంటాయి.సంక్రాంతి పండుగకు.. స్కూల్ విద్యార్థులకు జనవరి 10 నుంచి 20 వరకు సెలవులు ఉంటాయి. జూనియర్‌ కాలేజీలకు జనవరి 11 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించారు. పండుగకు విద్యార్థులకు పదిరోజుల పాటు సెలవులు రావడంతో పిల్లలు ఆనందంలో ఉన్నారు. డిసెంబర్ చివరి వారం నుంచి ఫెస్టివల్ ఫీవర్ కనిపించనుండగా.. వరుస సెలవులతో మళ్లీ సందడి వాతావరణం నెలకొననుంది.క్రిస్మస్, సంక్రాంతి సెలవులతో విద్యార్థులు మళ్లీ సొంత ఊళ్లకు క్యూ కట్టనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీతో పాటూ తెలంగాణలోని జిల్లాలకు వెళ్లనున్నారు. మళ్లీ ఆర్టీసీ బస్సులు, రైళ్లు రద్దీగా మారనున్నాయి.

 

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

 

Tags:The week to Christmas, ten days to the wallpapers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *