Natyam ad

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

చౌడేపల్లె ముచ్చట్లు:
 
నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు అన్నారు. బుధవారం మండలంలోని 29ఏ.చింతమాకులపల్లె, పెద్దకొండామర్రి, వెంగళపల్లె ,కాగతి, పుదిపట్ల,దిగువపల్లె, గ్రామసచివాలయాల్లో వై స్సార్‌ పెన్షన్‌ కానుకలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ వెహోత్తాన్ని పెంచుతూ సీఎం జగనన్న తీసుకొన్న నిర్ణయంతో పేదలకు మేలు జరుగుతోందన్నారు. కుల మతాలకు అతీతంగా లబ్దిదారులకు వలంటీర్ల సేవల ద్వారా అర్హత ఉన్నప్రతి లబ్దిదారుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనంతరం పెన్షన్‌ కానులను పంపిణీ చేయడంతోపాటు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌,సర్పంచ్‌లు హైమావతి, షంషీర్‌, సుజాత, నాగరత్న,సోని, జయసుధమ్మ ఎంపీటీసీ లక్ష్మినర్సయ్య, గంగులమ్మ తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
 
Tags: The welfare of the poor is the goal of the government