ఇంకా దొరకని నిందితుల ఆచూకీ

గుంటూరు ముచ్చట్లు:

 

సీతానగరం పుష్కర ఘాట్‌ సమీపంలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. నిందితుడు కృష్ణ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు తన ఇంటి వద్ద రైల్వే ట్రాక్‌ వద్ద ప్రత్యక్షమయ్యాడు. స్థానికులు కేకలు వేయడంతో గూడ్స్‌ రైలు ఎక్కి పరారయ్యాడు. రైల్వే బ్రిడ్జిపైన కృష్ణ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమికుడి కాళ్లు, చేతుల్ని కట్టేసి.. కదిలితే పీక కోస్తామని బెదిరించి.. అతడి కళ్లెదుటే నర్సింగ్‌ విద్యార్థినిపై అకృత్యానికి తెగబడిన మృగాళ్లు ఎవరనేది పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు షేర్‌ కృష్ణ, వెంకటేష్‌లను  పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు అన్వేషిస్తున్నాయి.
నెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్‌ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం విదితమే. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు, ఓ నర్సింగ్‌ విద్యార్థిని కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడగా.. ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కృష్ణా నది ఒడ్డున రైల్వే బ్రిడ్జి వద్ద గల పుష్కర ఘాట్‌కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: The whereabouts of the accused have not yet been found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *