భర్తను చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

-నెల రోజుల తర్వాత బయట పడిన వ్యవహారం
-అల్లుని చంపడానికి సహకరించిన మామ
-ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Date:21/01/2021

జయశంకర్ భూపాలపల్లి  ముచ్చట్లు:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నేరేడుపల్లి గ్రామంలో ఓ మహిళ తన తండ్రి సాయంతో భర్తను హత్య చేసి అడవిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నర్సాక్కపల్లికి చెందిన రమేశ్, శారద దంపతులకు ఓ కూతురు ఓ కుమారుడు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాల వల్ల రమేశ్ను అత్తగారిల్లయిన నేరేడుపల్లికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి రమేశ్ కనిపించకుండా పోయాడు. తన భర్త కనిపించటంలేదని భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో భార్య శారద ఇదివరకే ఫిర్యాదు చేసింది. అనంతరం రమేశ్ బంధువుల పెళ్లికి కూడా వెళ్లి వచ్చింది. నెల తర్వాత అసలు విషయం బయటపడింది. చనిపోయిన వారికి చేయాల్సిన నెల మాసికం కార్యక్రమాన్ని శారద చేసింది. ఇవన్ని చూసి అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్థులు నిలదీయగా… తానే చంపినట్లు ఒప్పుకుంది. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది. తన తండ్రి సాంబయ్యతో కలిసి భర్తను చంపేసినట్లు శారద ఒప్పుకుంది. అనంతరం అడవిలో పాతిపెట్టినట్టు పేర్కొంది. రమేశ్ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags: The wife who killed her husband and buried him in the forest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *