Natyam ad

మంత్రులకు ఎదురు గాలి….

విశాఖపట్టణం ముచ్చట్లు:

రాయలసీమ,  కోస్తా, పల్నాడు ప్రాంతాలు ఏవైనా అధికార వైసీపీ ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటోంది.  ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడికక్కడ ఎదురీదక తప్పని పరిస్థితే వుంది.  ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా అందరి  గుండెల్లోనూ ఓటమి భయం దౌడు తీస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   వై నాట్ 175’ అని బింకాలు పోతున్నా,  వాస్తవ పరిస్థతి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని, సర్కార్ వారి ఐప్యాక్ సహా ఒకటికి మూడు సర్వేలు నొక్కి వక్కాణిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రుల జాతకాలపై ఐ ప్యాక్ నిర్వహించిన సర్వేలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్‌ బాషా,  నారాయణస్వామి, పినిపె విశ్వరూప్‌,  దాడిశెట్టి రాజా మినహా మిగిలిన మంత్రులు, మాజీ మంత్రులు ఎవరూ తిరిగి అసెంబ్లీ గడప తొక్కే అవకాశమే లేదని సర్వే తేల్చి చెప్పిందని అంటున్నారు. నిజానికి, ఈ నలుగురైదుగురు మంత్రులు కూడా ఖాయంగా గెలుస్తారని కాదుట, మిగిలిన వారికంటే గెలిచే అవకాశాలు వీరికి కొంచెం ఎక్కువగా ఉన్నాయని మాత్రమే ఐప్యాక్ సర్వే స్పష్టం చేసినట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది.ఉత్తారాంధ్రలో అయితే, ఆరుగురికి ఆరుగురు మంత్రులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఐ ప్యాక్ సర్వే స్పష్టం చేసిందని, అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని,

 

 

 

 

అందులో భాగంగానే విశాఖకు మకాం మార్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం ఇప్పటికే ఫిక్సయి పోయారని అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో అందుకే, ఉత్తరాంధ్ర మంత్రులలో ఒకరు కూడా గెలిచే అవకాశమే లేదని తెలియడంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 మంది మంత్రులు, తాజా మాజీ మంత్రులపై ఐ ప్యాక్ టీమ్ సర్వే చేసినట్టు తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం  ప్రస్తుత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్‌ బాషా, నారాయణస్వామి, పినిపె విశ్వరూప్‌, దాడిశెట్టి రాజా పేర్లు  గెలిచే అవకాశమున్న  వారి జాబితాలో కనిపిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది.ప్రధానంగా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు ఓటమి అంచున ఉండడం విశేషం. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉమ్మడి రాష్ట్రంలోనూ మంచి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సొంత జిల్లా విజయనగరం జిల్లాను తన కుటంబ సామ్రాజ్యంగా మలుచుకున్నారు. చీపురుపల్లి నియోజక వర్గంలో ఆయనకు ఎదురన్నదే లేదని అంటారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన అన్నినియోజక వర్గాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది. అయితే అందుకు ఒకే ఒక్క మినహాయింపు చీపురుపల్లి నియోజక వర్గం. బొత్స ఒక్కరే డిపాజిట్ దక్కించు కున్నారు.  అయితే, ఆయన మళ్ళీ అదే నియోజక్వరం నుంచి పోటీ చేస్తే, ఓడిపోతారని సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. 2004 నుంచి చీపురుపల్లి నుంచి పోటీచేసిన బొత్సకు 2014లో మాత్రం ఓటమి ఎదురైంది. అయితే ఈసారి చీపురుపల్లి నుంచి బొత్స గెలుపు అంత ఈజీ కాదట.

 

 

 

 

Post Midle

అందుకే ఆయన వేరే నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో ఉన్నట్టు సమాచారం.మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎదురీదుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిపై ఏడు వేల ఓట్లతో మాత్రమే గెలుపొందారు.  మూడేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఇటీవలే మంత్రి అయ్యారు. కానీ ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు లేదు. దీంతో అటు సొంత పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గ ప్రజల్లో కూడా అసంతృప్తి నెలకొని ఉంది. రోజు రోజుకూ ఆయనపై వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఐ ప్యాక్ తన సర్వేలో గుర్తించినట్టు సమాచారం.మంత్రి సీదిరి అప్పరాజు పరిస్థితి కూడా బాగాలేదు. పలాస నియోజకవర్గంలో ఆయన సొంత పార్టీ నుంచే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు పెరుగుతుండడం, అనుచరులు దందాలకు దిగుతుండడం ఆయనకు మైనస్ గా మారింది. అటు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు లేకపోవడం, నిత్యం రాజకీయ వివాదాలు జరుగుతుండడంతో ప్రజల్లో ఒకరకమైన అసంతృప్తి పెల్లుబికినట్టు సమాచారం. మంత్రి చేసింది తక్కువ..ఆర్భాటం ఎక్కువ కావడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా ఐ ప్యాక్ టీమ్ గుర్తించినట్టు సమాచారం.మన్యం జిల్లా మంత్రి పీడిక రాజన్నదొర సైతం సాలూరు నియోజకవర్గంలో ఓటమి బాటలో ఉన్నారు.

 

 

 

 

గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన రాజన్నదొర విద్యాధికుడు, వివాదరహితుడు. దీంతో జగన్ మలి విడత విస్తరణలో రాజన్నదొరకు మంత్రి పదవి ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా కూడా ఎంపిక చేశారు. అయితే గిరిజనుల సమస్యలపై స్పందిస్తున్నా ప్రభుత్వం నుంచి నిధుల విడుదల లేకపోవడంతో ఆయనకు మైనస్ గా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నానని రాజన్నదొర లోలోపల బాధపడుతున్నారు. సమస్యలు పరిష్కారం కాక నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆ ప్రభావం రాజన్నదొర గెలుపుపై చూపుతోంది. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనుకుంటున్న మంత్రి బూడి ముత్యాలనాయుడుకు ఈసారి కష్టమేనని ఐ ప్యాక్ టీమ్ గుర్తించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ముత్యాలనాయుడికి చాన్సిచ్చారు. కీలక పోర్టు పోలియోలతో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. కానీ మంత్రిగా తన ముద్ర చూపుకోవడంలో ముత్యాలనాయుడు ఫెయిలయ్యారు. అటు మాడుగుల నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి లేకపోవడంతో ప్రజల్లో వైసీపీ సర్కారుపై విరక్తి పెరిగింది.

 

 

 

 

ఆ ప్రభావం ముత్యాలనాయుడు గెలుపుపై చూపుతోంది.అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఓటమి తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన అమర్నాథ్ కు మంత్రివర్గ విస్తరణలో అమాత్య పదవి కట్టబెట్టారు. కానీ ఆయనకు పార్టీలోనూ అసమ్మతి ఉంది. నియోజకవర్గ ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొని ఉంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ ప్రగతి వైపు చూడకుండా నిత్యం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణ  ఉంది. గత ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో గెలుపొందారు. ఈసారి అన్ని ప్రతికూలతల దృష్ట్యా అమర్నాథ్ ఓటమి తప్పదని ఐ ప్యాక్ టీమ్ నిర్థారించినట్టు తెలుస్తోంది.ఇలా ఉత్తరాద్రలో వైసీపే మంతతరులు ఎదురీదుతున్నారు. నిజానిని, సగానికి సగం మందికిపైగా మంత్రులు పోటీ చేసేందుకు కూడా వెనకాడుతున్నారని అంటున్నారు.

 

Tags:The wind against the ministers

Post Midle