మహిళ అనుమానస్పదస్థితిలో మృతి

Date:19/09/2020

గుంటూరు  ముచ్చట్లు:

గుంటూరు పట్టణంలోని లెనిన్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. లెనిన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వేముల జ్ఞానయ్య, పుష్పలతకు 19 ఏళ్ల క్రితం వివాహామైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. జ్ఞానయ్య లారీ డ్రైవరు. అయితే అతనికి జానపాడుకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ విషయమై భార్యభర్త కొంతకాలంగా గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో వారు ఎనిమిది నెలలు క్రితం విడిపోయారు. భార్య లెనిన్‌నగర్‌లో పెద్ద కుమార్తెతో ఉండేది. భర్త ఆదర్శనగర్‌ కాలనీలో చిన్న కుమార్తె, కుమారునితో ఉంటున్నాడు. పెద్ద కుమార్తెకు పుష్పలత నాలుగు నెలల క్రితం వివాహం చేసింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉండేది. అదే ప్రాంతంలో ఆమె తల్లీ సుబ్బమ్మ కూడా ఉంటుంది. తల్లీ సున్నం పనులకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాగా పుష్పలత ఆమె ఇంటికి వెళ్లి రేకులకు ఏర్పాటు చేసిన ఇనుపరాడ్‌కు ఊరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. స్థానికులకు చెప్పగా వారు మృతదేహాన్ని కిందకు దించారు.

 

శ్రీశైలంలో జలకళ

Tags:The woman died under suspicious circumstances

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *