ఉల్లి కోసం గోడ దూకేసిన మహిళ

The woman who jumped off the wall for the onion

The woman who jumped off the wall for the onion

Date:06/12/2019

విజయనగరం ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల క్రితం వరకు రూ.125 పలికిన ఉల్లి ధర గురువారానికి ఏకంగా రూ.150కి చేరింది. హైదరాబాద్‌లో ఉల్లి పాయలు కిలో రూ.150లకి పైగా ధర పలుకుతోంది. చెన్నైలో రూ.180కి చేరింది. దీంతో సామాన్యులు ఉల్లి అంటేనే భయపడుతున్న పరిస్థితి. ఏం కొనేట్టు లేదు.. తినేట్టు లేదంటూ సామాన్యులు ఉసూరుమంటున్నారు.ఉల్లి ఎక్కువగా సాగయ్యే మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వరదలతో పంట పూర్తిగా దెబ్బతింది. భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఉల్లి డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. అయినప్పటికీ మార్కెట్ అవసరాలకు సరిపోయేంత ఉల్లి నిల్వలు లేకపోవడంతో ధరలు కిందికి దిగి రావడం లేదు.ఉల్లి ధరలు అమాంతంగా పెరగడంపై దృష్టి సారించిన జగన్ సర్కార్.. రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు ఉల్లి విక్రయించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కిలో ఉల్లిపాయలను కేవలం రూ.25లకే ఇవ్వాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించింది. అందుకు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్‌ను వినియోగించుకోవాలని సూచించింది.

 

 

 

 

 

 

 

ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ ఉల్లిపాయలను కొనుగోలు చేసి కిలో రూ.25 చొప్పున రైతు బజార్లలో విక్రయిస్తోంది. మార్కెటింగ్ శాఖ అధికారులే స్వయంగా ఉల్లి మార్కెట్‌కి వెళ్లి వేలంలో ఉల్లి పాయలన కొంటున్న పరిస్థితి.సామాన్యులకు కిలో ఉల్లిపాయలను రూ.25లకే ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ సరిపడా ఉల్లి అందుబాటులో లేని పరిస్థితి. గతంలో కర్నూల్ మార్కెట్‌కు నిత్యం పది వేల క్కింటాళ్ల ఉల్లి వచ్చేదని అంచనా. ప్రస్తుతం అది వెయ్యి క్వింటాళ్లకు మించడం లేదని సమాచారం. దీంతో స్థానిక వ్యాపారులు.. మార్కెటింగ్ శాఖ అధికారులు పోటాపోటీగా వేలంలో పాల్గొంటున్నారు. ఫలితంగా ధర రూ.150 వరకూ చేరింది. అయినప్పటికీ ప్రభుత్వం కిలో ఉల్లిని రూ.25కే అందజేస్తోంది.మార్కెట్‌లో ఉల్లి ధరలు ఒక్కసారిగా రూ.150కి చేరడంతో ఎక్కువ మంది రైతు బజార్ల వైపు చూస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

సబ్సిడీ ఉల్లి కోసం బారులుదీరుతున్నారు. రైతు బజార్లలో డిమాండ్‌కి తగినట్లుగా ఉల్లి నిల్వలు లేకపోవడంతో వినియోగాదారులను కట్టడి చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉల్లి కోసం ఎగబడుతుండడంతో తోపులాటలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట చిత్తూరులో తొక్కిసలాట జరిగి పలువురు వినియోగదారులు గాయాలపాలయ్యారు.తాజాగా విజయనగరంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉల్లిపాయల కోసం రైతు బజార్‌కి భారీగా వచ్చిన వినియోగదారులను లోపలికి అనుమతించకపోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గంటల తరబడి వేచి చూసిన ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. అంతఎత్తున ఉన్న రైతు బజార్ గోడను అమాంతం దూకేసి ఉల్లిపాయల కోసం పరుగులు తీసింది. ఉల్లి కోసం మహిళ చేసిన పని చూసి అంతా షాక్‌‌కు గురయ్యారు. మహిళ గోడ దూకిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరలైంది. ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్.

 

పెట్రోల్ ధర తగ్గింది….

 

Tags:The woman who jumped off the wall for the onion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *