కూతురిని బస్సు కిందకు తోసేసిన మహిళ

Date:27/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో కన్నతల్లే కసాయిగా మారింది. కన్న కూతురినే బస్సు కిందికి తోసేసి ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది.కూకట్‌పల్లిలోని భాగ్యనగర్‌ కాలనీలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. అదే సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ తన కుమార్తెను ఒక్కసారిగా బస్సు కిందికి తోసేసింది.

 

 

అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సులోని ప్రయాణికులకు ఒక్కసారిగా ఏం జరిగిందోనని షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనను చూసిన స్థానికులు పరుగుపరుగున అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడారు. ఘోరానికి పాల్పడిన తల్లిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్రమత్తంగా ఉండి చిన్నారిని కాపాడిన బస్సు డ్రైవర్‌ను స్థానికులు అభినందించారు. కన్నబిడ్డనే చంపుకునేందుకు ప్రయత్నించిన మహిళ వివరాను పోలీసులు సేకరిస్తున్నారు.

 

చిరంజీవితో రాములమ్మ.

Tags: The woman who threw her daughter under the bus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *