Natyam ad

మహిళ మృతదేహం లభ్యం

పల్నాడు ముచ్చట్లు:


పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పంట పొలాల్లో  గుర్తు తెలియని మహిళా  మృతదేహం లభ్యం అయింది.  చిలకలూరిపేట మండలం తాతపూడి పంచాయతీ పరిధిలో  నేషనల్ హైవే కి ప్రక్కన ఉన్న శ్రీ భువనేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరలో గుర్తుతెలియని మహిళ మృతదేహం పడివుంది.   తాతపూడి హైవే దగ్గర నుండి యద్దనపూడి మండలం  సురవరపు గ్రామానికి వెళ్లే రోడ్డు దారి లోని మధ్య పొలంలో  రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో  పడి ఉన్న గుర్తుతెలియని మహిళ మృతదేహం గురించి, సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీస్ సిబ్బంది వారు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ కు సమాచారం అందించారు,  మహిళ వయసు  సుమారు 33 సంవత్సరాలు  ఉండొచ్చని అంచనా. మహిళ మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది అన్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ లు తెలియజేశారు.

 

Tags: The woman’s body was found

Post Midle
Post Midle