Natyam ad

ఇచ్చిన మాట…చేసిన అభివృద్ధి చూసి ఆశీర్వదించండి

– రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తు పై వేయండి
– గడప గడపకు కరపత్రా
– ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల పాదయాత్రలో ఇచ్చిన మాట, చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరు వైఎస్సార్‌సీపీని ఆశీర్వధించి, రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి రెండవ సారి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డితో కలసి ఆయన పట్టణంలోని చింతలవీధి, కట్టక్రిందపాళె ం, రాములవారివీధి, ప్యాలెస్‌ కాంపౌండు, కుమ్మరవీధి, బజారువీధి ప్రాంతాలలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోసాల బాబును నమ్మద్దు…అపద్దాల మ్యానిఫెస్టో మనకొద్దు అనే కరపత్రాలను విడుదల చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ మే 13న జరగనున్న అసెంబ్లి, పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు.

 

 

ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డికి మహిళలు నీరాజనాలు పలికారు. మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి అభివాదం చేసి పెద్దిరెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లుగా పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిని చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు అడ్డుకున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వేల కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పుంగనూరును అన్నివిధాల అభివృద్ధి చేశామన్నారు. ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే మతోన్మాదం చెలరేగిపోతుందన్నారు. హిందూ,ముస్లిం, క్రిష్టియన్లు సోదరబావంతో జీవిస్తున్నారని , వీటికి విఘాతం కలగకుండ ఉండేందుకు ఉమ్మడి పార్టీ అభ్యర్థులను ఓడించాలన్నారు. ఎన్నికలలో ప్రజలను మోసగించేందుకు మాయమాటలతో, అమలుకానీ మ్యానిఫెస్టోలతో వచ్చి ఓట్లు అడిగే వారికి గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి , జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లలిత, కౌన్సిలర్లు రెడ్డెమ్మ, కాళిదాసు, జెపి.యాదవ్‌, కిజర్‌ఖాన్‌, రేష్మా, సాజిదాబేగం, భారతి, పద్మావతమ్మ తో పాటు పలువురు పాల్గొన్నారు.

 

Tags: The word given…be blessed by the progress made

Post Midle