నత్తనడకన  విద్యాశాఖ పనులు

కరీంనగర్ ముచ్చట్లు:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ కు దిక్కు లేకుండా పోయింది. జిల్లాకు విద్యాశాఖాధికారి పోస్టులను ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇప్పటి వరకు AD అధికారులే DEO గా వ్యవహరించారు. ఇక్కడ ఇంచార్జ్ ఈవోగా వ్యవహరించిన శ్రీనివాసరెడ్డి సెలవుపై వెళ్లడంతో డీఈఓ గదికి తాళం వేశారు. ఈ నెల రోజులుగా ఎవరికీ ఈ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో అనాధగా మిగిలింది. జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు మండల విద్యాధికారులు, జిల్లా అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల జిల్లాగా పేరొందిన ఇక్కడ విద్యా శాఖలో ఖాళీలు భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని ఆరోపణలున్నాయి. ఈ జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో పలుకబడిన నేతలు ఉన్నప్పటికీ ఖాళీల భర్తీ చేయడం పట్ల శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి. ఖాళీలు భర్తీ చేసి విద్యాశాఖను ఆదుకోవాలని జిల్లాకు చెందిన ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. రెండు నెలలుగా జిల్లా విద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో కింది స్థాయి సిబ్బందిలో జవాబుదారితనం కొరవడింది. జిల్లాలో ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ కాలేదు. పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. మహాదేవపూర్, పలిమేల, కాటారం, మహాముత్తారం, మల్హర్ భూపాలపల్లి మండలాలకు కలిపి ఒక్కరే ఎంఈఓ విధులు నిర్వహిస్తున్నారు.

 

 

 

మన ఊరు-మన బడి పథకంలో పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ పనులు సకాలంలో పూర్తి కాలేదు. విద్యాబోధన సక్రమంగా జరిగేలా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు లేకపోవడంతో ఈ బాధ్యత ఇతర శాఖల అధికారుల పై పడింది. ఈ పథకం పై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నప్పటికీ ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా 15 రోజులుగా పనులు నిలిచిపోయాయి.జిల్లాలో విద్యాశాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. బడి బాట కార్యక్రమం అంతంత మాత్రమేనని జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 429 ప్రభుత్వ పాఠశాలల్లో 369 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంతో విద్యాబోధన అటకెక్కింది. జిల్లా విద్యాశాఖలో సూపరిండెంట్‌కు ఏడి గా ప్రమోషన్ ఇస్తే వీరిలో బీఈడీ అర్హత కలిగిన యోగులు డీఈఓ గా విధులు నిర్వహించే అవకాశం ఉంది. టీచర్ల స్థాయి నుండి సూపర్వైజర్ స్థాయి వరకు ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో ఎన్నో సమస్యలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా డీఈఓ లేకపోవడంతో ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూరిబా బాలికల పాఠశాలలు పనిచేసే టీచర్లతో పాటు పాఠశాలలో పనిచేసే టీచర్ల సమస్యలు పేరుకుపోతున్నాయి. దీంతో జీతాలు సక్రమంగా అందడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న పార్టీ నేతలు జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టులు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది.

 

Tags: The work of the education department is slow

Leave A Reply

Your email address will not be published.