20వ తేదీలోపు పనులు పూర్తి కావాలి

– చిన్న పిల్లల ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించిన టీటీడీ ఈవో

 

తిరుపతి ముచ్చట్లు:

 

బర్ద్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు జూలై 20 వ తేదీలోపు పూర్తి కావాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ఈ పనుల పురోగతిని పరిశీలించారు.
ఆసుపత్రిలో నిర్మిస్తున్న మూడు ఆపరేషన్ థియేటర్లు, ఓపి, ఐసీయూ, జనరల్ వార్డులు, ల్యాబ్, పరిపాలనా విభాగాల నిర్మాణం పనులను ఆయన చూశారు. పనుల వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వైద్య పరికరాలు, ఫర్నీచర్, ఇతర మిషనరీ పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు ఇసుక ఇబ్బంది ఉందా అని ఆరా తీశారు.టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ఈ లు  జగదీశ్వరరెడ్డి,  వెంకటేశ్వర్లు, బర్ద్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, సిఎస్ఆర్ఎమ్ఓ  శేష శైలేంద్ర తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: The work should be completed by the 20th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *