వేదప్రామాణికంగా నడిస్తేనే జగత్తు సుభిక్షం : స్విమ్స్ డీన్ డా.అల్లాడి మోహన్
తిరుమల ముచ్చట్లు:
వేదప్రామాణికంగా జగత్తు నడవాలని, అప్పుడే సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంటుందని స్విమ్స్ డీన్ డా.అల్లాడి మోహన్ పేర్కొన్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని నానీరాజనం వేదికపై జరుగుతున్న శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో మంగళవారం ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా.అల్లాడి మోహన్ “వేదంలో ఆధునిక వైద్యం” అనే అంశంపై ఉపన్యసిస్తూ, భారతదేశంలో వేల సంవత్సరాల నుండి వేద విజ్ఞానం పరిఢవిల్లుతోందన్నారు. ఇలాంటి వేద విజ్జానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెప్పారు. వేదాలలో చెప్పిన విధంగా ఆహార అలవాట్లు అవలంబిస్తే శరీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందన్నారు. వేదాల్లో మానవాళికి ఉపయోగపడే అనంతమైన రహస్యాలు దాగి ఉన్నాయన్నారు. ఇందులో కుష్ఠు వ్యాది ఎలా వస్తుంది, దాని నివారణ, క్రిమివినాశక మంత్రాలు తదితర అంశాలు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.
Tags: The world is blessed only if it is followed according to Vedas: Dean of Swims Dr. Alladi Mohan

