రేషన్‌బియ్యం గోడౌన్‌లో పురుగులు

The worms in the rationbium godown

The worms in the rationbium godown

– బెంబేలెత్తిపోతున్న జనం

Date:13/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తిరుపతి రోడ్డులో గల మార్కెట్‌ కమిటిలో రేషన్‌షాపుల బియ్యం గోడౌను నుంచి పురుగులు వస్తుండటంతో చుట్టు ప్రక్కల నివాసం ఉన్న ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గోడౌన్‌లో వేలాది బియ్యం బస్తాలు నిల్వ ఉంటుంది. ఇందులో నుంచి ఎర్రటి రెక్క పురుగులు, తెల్లటి పురుగులు గోడౌన్‌లో నుంచి బయటకు వచ్చి నివాస గృహాల్లో చేరిపోతోంది. దీని కారణంగా ఆహార పదార్థాల్లో సైతం పురుగులు రావడం, నిద్రించే సమయంలో పురుగులు రావడంతో పిల్లలు , పెద్దలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఆప్రాంతంలో ప్రజలు సంచరించే సమయంలో కూడ పురుగులు శరీరంపై పాకుతుండటం గమనార్హం. ఈ విషయమై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. గోడౌను శుభ్రం చేస్తే పురుగులు తగ్గిపోతుందంటున్నారు. ఈ విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, గోడౌను శుభ్రం చేయడం లేదా గోడౌను వేరోక చోటికి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తా

Tags: The worms in the rationbium godown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *