ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

The worst accident is the three deaths

Date:20/05/2018

జయశంకర్ భూపాలపల్లి ముచ్చట్లు:

రెండు ద్విచక్రవాహనాలు ఒకదానొకటి ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం మొట్లగూడెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ప్రమాదవశాత్తు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను కాలపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Tags: The worst accident is the three deaths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *