ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం

The worst danger in Uttarakhand

The worst danger in Uttarakhand

Date:19/07/2018
డెహ్రాడూన్ ముచ్చట్లు:
ఉత్తరాఖండ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రిషికేశ్ – గంగోత్రి జాతీయ రహదారిపై ఉత్తరాఖండ్ ఆర్టీసీకి చెందిన బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా, మరో 18 మంది గాయపడ్డారు. చంబా పట్టణం సమీపంలో గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. వీరిని మెరుగైన వైద్యం కోసం రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయానికి బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఉత్తరకాశి సమీపంలోని బోడ్‌కోట్ నుంచి 30 మంది ప్రయాణీకులతో బయలుదేరిన బస్సు ఉదయం 8 గంటలకు సూర్యధార వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న 250 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఆరోగ్యం విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం తరలించడానికి హెలికాప్టర్లను సైతం ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అధికారులు అక్కడకు చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రుల కోసం హెలికాప్టర్లను సైతం ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టక్ సోనికా ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోన్నట్టు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి అమిత్ సింగ్ నేగి పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తునకు రవాణా శాఖ కార్యదర్శి ఆదేశించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50ల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 1 న పౌరి గర్వాల్ వద్ద ఇలాంటి ప్రమాదమే సంభవించింది. ఓ బస్సు లోయలో పడి 48 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం https://www.telugumuchatlu.com/the-worst-danger-in-uttarakhand/
Tags:The worst danger in Uttarakhand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *