Natyam ad

మఠాధిపతుల ఆగ్రహం…

తిరుమల ముచ్చట్లు:

హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేస్తున్న టీటీడీ అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం స్వప్నా నందుల ఆశ్రమం శ్రీశ్రీశ్రీ చంద్రమౌళీశ్వర స్వామి విమర్శించారు. తిరుమల శ్రీవారిపై జరుగుతున్న అపోహలను తెలుసుకోవడానికి సుమారుగా 40 మందిపైగా పీఠాధిపతులు, మఠాధిపతులు తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చారు. శ్రీవారి సన్నిధికి వెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారని, టీటీడీ ఈవో ఇతర కులానికి చెందిన వారిగా ఉన్నాడని తీవ్ర విమర్శ చేశారు శ్రీవారి దగ్గరికి వెళ్లాలంటే పీఠాధిపతులు కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలని అన్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో శ్రీవారికి నిలువునామం కూడా తీసివేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న అధికారులు వారి మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీటీడీ ఈవోపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కులాలకు మతాలకు అతీతంగా అందర్నీ సమానంగా పీఠాధిపతులు, మఠాధిపతులు చూస్తారని, అలాంటి వారికే తీవ్ర అవమానం జరిగేలా టీటీడీ సిబ్బంది ప్రవర్తించారని అన్నారు. హిందూ ధార్మిక సంస్థలపై జరుగుతున్న దాడిపై, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వారితో పీఠాధిపతులు, మఠాధిపతులు కలిసి లక్షలాది మంది హిందువులతో, హిందూ మహాసభను తిరుపతి నగరంలో నిర్వహించబోతున్నట్లుగా శ్రీశ్రీశ్రీ చంద్రమౌళీశ్వర స్వామి స్పష్టం చేశారు.

 

Tags: The wrath of the abbots…

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.