Date:30/11/2020
ఏలూరు భువనగిరి
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో యువతి ని వేధిస్తున్న కేసు విషయంలో సంఘటనా స్థలానికి వెళ్లిన కానిస్టేబుల్ పై దాడి చేసి అనంతరం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు రోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ తెలిపిన వివరాలు ప్రకారం అక్టోబర్ నెలలో రోహిత్ అనే యువకుడు ఓ యువతిని వేధిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి రాంబాబు అనే కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి వెళ్లాడు. అక్కడ రోహిత్ సదరు కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోయాడు. మరుసటి రోజు రోహిత్ సెల్ టవర్ ఎక్కి బెదిరింపులకు పాల్పడ్డాడు .టవర్ పై ఉన్న తేనెటీగలు రోహిత్ పై దాడి చేయడంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. వైద్యం జరుగుతున్న సమయంలో రోహిత్ అక్కడినుంచి పారిపోయాడు. గుంటూరు జిల్లా స్టువర్టపురం అతని బంధువుల వద్ద, ఉన్నాడని సమాచారం రావడంతో పోలీసు బృందాలు అక్కడ గాలింపు చర్యలు చేపట్టగా ప్రయోజనం లేకపోయింది. అనంతరం ఎస్పీ కేస్ ను ఛాలెంజ్ గా తీసుకొని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ ఆధ్వర్యంలో ఎస్సై ఆనంద్ రెడ్డి బృందం రోహిత్ పట్టుకుంది. రోహిత్ పై పలుసెక్షన్ల్ నమోదు చేసి అతనిని కోర్టులో హాజరుపరిచారు. నిందుతుడు పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని జంగారెడ్డిగూడెం డిఎస్ పి తెలిపారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి లో ప్రత్యేక పూజలు
Tags:The young man who attacked the constable was arrested