ఎమ్మెల్యేను అడ్డుకున్న యువకులు

వికారాబాద్ ముచ్చట్లు :

 

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ని అడ్డుకునేందుకు అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ప్రయత్నించారు.గ్రామం నుండి పొలాలకు వెళ్ళే దారిని బాగు చేయించాలని ఎమ్మెల్యే ను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు యువకులతో వాగ్వాదానికి దిగారు.ఎమ్మెల్యే వర్గీయులు యువకులపై భూతులతో విరుచుకుపడ్డారు.మీడియాను విడియోలు తియ్యోద్దని ఎమ్మెల్యే సైగ చేశారు. వీడియోలు చిత్రీకరిస్తున్న మిడియాను వేలెత్తి చూపిస్తూ వాళ్ళు విడియోలు తీసి టైంపాస్ చేస్తూ సినిమా చూపిస్తారని మిడియాను ఎద్దేవా చేశారు.  పోలీసులు ఆయువకులను ప్రక్కకు నెట్టే ప్రయత్నించారు.రాపోలు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఒకింత ఉద్రిక్తత కు దారితీసింది. యువకుల ఆందోళనతో ఎమ్మెల్యే అక్కడినుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: The young men who blocked the MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *