అన్నను హతమార్చిన తమ్ముడు
మహబూబాబాద్ ముచ్చట్లు:
ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నతమ్ముల మధ్య భూ వివాదం నెలకొంది. దాంతో తమ్ముడు సొంత అన్నను అతికిరాతకంగా కత్తి తో గొంతుకోసి హత్య చేసిన దారుణ సంఘటన మహబూబాబాద్ జిల్లా రోటీబండ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన భూక్యా వెంకన్న (40), తమ్ముళ్లు గోవర్ధన్, జనార్దన్ లు గతంలో భూమిని పంచుకొని వ్యవసాయం వేరు వేరుగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లితండ్రుల పేరిట ఉన్న మరో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎకరం తల్లి తండ్రులను చూసుకున్న వెంకన్నకు రాగా మరో ఎకరం భూమి ముగ్గురు అన్నతమ్ముల మధ్య భూ వివాదం చిచ్చు రేపింది. ఈ అన్నతమ్ముల మధ్య భూ వివాదం నెలకొంది. అది ముదిరి బద్ధ శత్రువులుగా మారారు. చివరకు తొడపుట్టిన అన్న వెంకన్న ను తమ్ముడు గోవర్ధన్ కత్తి తో అతికిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. వెంకన్న రాత్రి భోజనం ముగించుకొని తన భార్యతో ఇంటి ఆవరణలో నిద్రస్తుండగా తమ్ముడు వచ్చి కత్తితో గొంతు కోసాడు వెంకన్న అరుపులతో భార్య నిద్ర నుండి లేచి కేకలు వేయడంతో గోవర్ధన్ పారిపోయాడు. వెంకన్న మృతి తో తండా లో విషాదా ఛాయలు అలుముకున్నాయి. మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags: The younger brother who killed Anna

