అన్నను హతమార్చిన తమ్ముడు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం డబ్ల్యు.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఎల్లాల బాలలింగారెడ్డి ఆస్తి తగాదాలో తమ్ముడు ఎల్లాల వెంకటరామిరెడ్డి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గత రెండెళ్ల నుంచి వీరి మధ్య పొలం విషయంలో తరచూ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో డబ్ల్యు.కొత్తపల్లెలో ఇంటి వద్ద చోటుకున్న గొడవలో వెంకటరామిరెడ్డి, ఆయన కుమారుడు లోకేష్‌రెడ్డి ఎల్లాల బాలలింగారెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. హతుడి కుమారులు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డి, లోకేష్రెడ్డిలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దొర్నిపాడు ఎస్ఐ తిరుపాలు చెప్పారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించిట్లు ఆయన తెలిపారు.
Tags;The younger brother who killed Anna

