The youth dies as the father reprimands him

తండ్రి మందలించడని మనస్తాపంతో యువకుడు మృతి

Date:25/05/2020

పెద్దపంజాణి ముచ్చట్లు:

అత్తారింట్లో చిన్నపాటి గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చిన కుమారుడిని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెద్దకాప్పల్లె పంచాయతీ పెనుగొలకల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెనుగొలకల గ్రామానికి చెందిన నాగరాజ కుమారుడు హరీష్‌ (31) కి సోమల మండలం పొలికిమాకులపల్లె గ్రామానికి చెందిన భూలక్ష్మీతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి  కుమారై(వెన్నెల) ఉంది. భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం అత్తారింటికి వెళ్లి హరిష్‌ బార్య అత్తమామలతో గొడవ పడి కుమారైను ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ జరిగిన గొడవ విషయాన్ని భూలక్ష్మీ కుటుంబీకులు ఫోన్‌ద్వారా హరీష్‌ తండ్రికి చెప్పారు. సోమవారం ఉదయం తండ్రి గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురైన హరీష్‌ గ్రామ సమీపంలోని సొంత పొలాల్లోని మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య భూలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి తెలిపారు.

పార్టీ కోసం పని చేస్తే గుర్తింపు తథ్యం.

Tags: The youth dies as the father reprimands him

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *