వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మహిళలదే రాజ్యం

– అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Date:28/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లోను మహిళలదే ఆగ్రస్థానమని ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.బ్యుధవారం ఐకెపి మండల కోఆర్డినేటర్‌ రవి ఆధ్వర్యంలో మహిళా సమాఖ్యల సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిధులుగా భాస్కర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలలో , నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం పైగా మహిళలకు కేటాయించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత, వైఎస్‌ఆర్‌ తోడు పథకాలతో పాటు జీరో వడ్డి రుణాలు, రుణాల వడ్డిని తిరిగి చెల్లించడం లాంటి పథకాలు ద్వారా మహిళలు తమంతకు తాముగా అభివృద్ధి చెందాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే రాష్ట్రం సుభిక్షంగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని రంగాల్లోను మహిళలకు అధికశాతం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి మహ్గన్నత అవకాశాన్ని మహిళలకు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మహిళలు నిండు మనసుతో ఆశీర్వధించి, జగన్‌ చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా ఆశీర్వధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.

నవంబర్ 26 వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి .

Tags: The YSRCP government is a women’s state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *