రెండొందల  కోట్ల దగ్గరలో రంగస్థలం

Theater is close to two billion

Theater is close to two billion

Date:16/04/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
రంగస్థలం’ చిట్టిబాబు బాక్సాఫీస్ రికార్డులను వినపడేటట్టు కాదు.. చరిత్రలో కనబడేటట్టు వీరబాదుడు బాదుతున్నాడు. రామ్ చరణ్, సమంత జోడీగా హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదలై.. కేవలం రెండు వారాల్లోనే టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. తాజాగా మ‌రో రికార్డ్ రంగస్థలం ఖాతాలో చేరింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 180  కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటి 200 కోట్లు  సాధించింది. చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. అటు ఓవర్సీస్‌లోనూ రామ్ చరణ్ సినిమాలన్నింటిలోనూ హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది ‘రంగస్థలం’. ఓవరాల్‌గా ఇప్పటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో ‘ఖైదీ నెం 150′ చిత్రం రూ. 164 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో టాప్ పొజిషన్లో ఉంది. ఈ మార్కును కేవలం 14వ రోజుల్లోనే ‘రంగస్థలం’ క్రాస్ చేసి రూ. 175 కోట్ల రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు చిట్టిబాబు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, నరేష్, అనసూయ, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా, పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో మెరిసిన ఈ సినిమా వీకెండ్‌లోనే కాకుండా వీక్ డేస్‌లో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటంతో ‘రంగస్థలం’ఖాతాలో మరిన్ని రికార్డులు చేరటం ఖాయంగానే కనిపిస్తుంది.
TAgs: Theater is close to two billion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *