పుంగనూరులోని సూపర్‌మార్కెట్‌లో దొంగతనం

Date:16/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తిరుపతి రోడ్డులో గల విజయలక్ష్మీ సూపర్‌మార్కెట్‌లో షెట్టర్లు పెరికి దొంగతనం చేశారు. వివరాలిలా ఉన్నాయి. షాపు యజమాని కాటమరెడ్డి శుక్రవారం రాత్రి దుకాణం మూసుకుని వెళ్లాడు. శనివారం ఉదయం తెరిచేందుకు ప్రయత్నించగా షెట్టర్లు పెరికి దొంగతనం చేసినట్లు గుర్తించాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా నలుగురు యువకులు మాస్క్లు ధరించి, షెట్టర్లు పెరికి, దుకాణంలోకి ప్రవేశించి నగదు రూ.30 వేలు చోరీ చేసుకెళ్లినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:Theft at a supermarket in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *