నెల్లూరు జిల్లా లో పలు గ్రామాల్లోని దేవాలయాల్లో చోరీ లు
-సంగం,చేజర్ల మండలాల్లో చోరీలు
నెల్లూరు ముచ్చట్లు:
సంగం మండలం మర్రిపాడు గ్రామం లో ఒకే రోజు మూడు దేవాలయాల్లో చోరీ జరిగింది….అలాగే చేజర్ల మండలం పెరుమాళ్ళ పాడు గ్రామంలోని నాగవరపుమ్మ దేవాలయంలో దొంగతనం జరిగింది.. దేవస్థానంలోని గర్భగుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి మెడలోని 14 కాసుల పేర్లు, తాళిబొట్టు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు…పూజారి శ్రీనయ్య గుడిలో దీపారాధన చేసేందుకు వెళ్ళగా గుడి తాళాలు పగలగొట్టి గుడిలో దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహించి గ్రామస్తులకు సమాచారం తెలిపాడు.. దీంతోగుడి వద్ద కు గ్రామస్తులు అందరూ చేరుకొని పరిశీలించారు. దొంగలు ఎత్తుకెళ్లిన నగలు హుండీలోని డబ్బుతో కలిపి వీటి విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.

Tags; Thefts in temples in many villages in Nellore district
