ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయం

-కడప పట్టణాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది.

Date:16/09/2020

కడప  ముచ్చట్లు:

ప్రజల సహాయ సహకారాలతో కడప పట్టణాన్ని  సుందరనగరంగా తీర్చి దిద్దడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాష  పేర్కొన్నారు. బుధవారం అయన లోతట్టు ప్రాంతాలైన మృత్యుంజయకుంట, ఖలీల్ నగర్,  కుమ్మరికుంట, ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి  మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని… ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. గత మూడు నాలుగు రోజులనుంచి పడుతున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలైన లోహియానగర్, మృత్యుంజయ కుంట, ఖలీల్ నగర్, కుమ్మరికుంట ప్రాంతాలలో వర్షపు నీరు రోడ్ల పైకి రావడం జరిగిందన్నారు. దీంతో నేడు మృత్యుంజయకుంట, ఖలీల్ నగర్, కుమ్మరికుంట, ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. ముఖ్యంగా మెయిన్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లన్నీ ఆక్రమణలకుగురి కావడంతో వర్షపు నీరంతా రోడ్లపైకి రావడం జరిగిందన్నారు.

 

 

ఎక్కడైతే పెద్ద పెద్ద డ్రైన్ లు, కల్వర్టులు ఆక్రమణకు గురయ్యాయో వెంటనే అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించడం జరిగిందన్నారు. డ్రైన్ లన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ డీసెల్ట్ చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. కడప పట్టణంలో ప్రజలు నూతన ఇల్లు నిర్మించుకునే వారు నగరపాలక సంస్థ వారి ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలన్నారు. నగరపాలక సంస్థ ప్లాన్ లేకుండా ఇల్లు నిర్మించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేడు డ్రైనేజీ కాలవలు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించడంవల్ల వర్షపు నీరంతా ఇంటికి వెళ్ళలేక రోడ్లపైకి వస్తున్నారు. కావున ప్రజలందరూ గమనించి మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా నగరపాలక సంస్థ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకు నట్లయితే ఇలాంటి సమస్యలు తలెత్తవన్నారు. మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి కడప నగరంలో ఎక్కడ ఎక్కడ నూతన ఇల్లు నిర్మించుకుంటున్నారో అవి ప్లాన్ ప్రకారం ఉండేటట్టు చూసేందుకు మీటింగులు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలన్నారు.

 

 

 

టౌన్ ప్లానింగ్ అధికారులు కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నూతన ఇళ్లు నిర్మించుకునేటట్లు ఇళ్ల యజమానులకు తెలియజేయాలన్నారు. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్లే కొంత మంది ప్రజలు డ్రైనేజీలు కల్వర్టులు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుంటున్నారన్నారు.  స్ట్రాంగ్ డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణాలకు14వ ఫైనాన్స్ నిధులు 50 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తయ్యాయన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఆ పనులు ప్రారంభించ లేక పోయామన్నారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సెక్షన్  అధికారులు వెంటనే కాంట్రాక్టర్లను పిలిపించి అగ్రిమెంట్లు పూర్తిచేసి పనులు ప్రారంభించాలనన్నారు. త్వరలో ఈ డ్రైన్ ల సమస్యలు పూర్తయితే రాబోయే రోజులలో రోడ్లపైకి నీరుచేరే అవకాశం ఉండదన్నారు.

 

 

కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఒక మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రి  గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సుమారు 128 కోట్ల రూపాయలతో  త్వరలో టెండర్లు పిలిపించి మూడు నాలుగు జోన్ లలో డ్రైనేజీ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.1,2 జోన్ లలో కూడా డి పి ఆర్ తయారుచేయడం జరిగిందన్నారు. ఈ జోన్ లకు కూడా సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించి కడప పట్టణాన్ని మురికి రహిత పట్టణంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.  బుగ్గవంకకు సంబంధించి పక్కన సర్వీస్ రోడ్డు లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల ఇబ్బందిని గమనించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత15 కోట్ల రూపాయలతో వచ్చే ఆదివారం శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. బుగ్గవంక ప్రక్కన సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడంవల్ల ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందన్నారు.

 

 

 

బుగ్గవంకకు దగ్గరలో ఉండే ప్రాంతం లోతట్టు ప్రాంతమని ఆ ప్రాంతమంతా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తులో వర్షాలు వచ్చినప్పుడు బుగ్గవంకకు నీరు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. గత ఆరు నెలలుగా కరోనా మహమ్మారి వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని ఇక వెంటనే ఆ పనులన్నీ ప్రారంభించాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. అమృత్ పథకం కింద బ్రిటిష్ కాలంలో వేసిన పైపులన్నీ మార్చడానికి నిధులు కూడా కేటాయించడం జరిగిందన్నారు. త్వరలో పాత పైపులు మార్చి ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ఖలీల్ నగర్ లో పెద్ద డ్రైన్ ను ఆక్రమించి డ్రైనేజీ కాలు పై గేట్లు పెట్టుకోవడం చాలా దారుణం అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేయడానికి కూడా వీరి లేకుండా కాలువను  ఆక్రమించుకోవడం మంచిది కాదన్నారు.

 

 

 

అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలందరూ అధికారులకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ ఖలీల్ నగర్, మృత్యుంజయకుంట, కుమ్మరి కుంట, ప్రాంతాలలో7 కిలోమీటర్లు కాలినడకన వీధి వీధి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, ఎస్ ఇ సత్యనారాయణ, ఎం హెచ్ ఓ శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సిబ్బంది, 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి లలిత, ఇంచార్జ్ విజయభాస్కర్ వర్మ, 31 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, 34 వ డివిజన్ ఇంచార్జి అక్బర్, అరుణ్ బాబు, మౌలాలి, సందాని, తదితరులు పాల్గొన్నారు.

కమాన్ పూర్ మండలంలో పులి సంచారం…

Tags:Their mission is to solve public problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *