వాళ్లది అపవిత్ర పొత్తు: యడ్యూరప్ప

Their unclean association: Yeddyurappa

Their unclean association: Yeddyurappa

Date:25/05/2018
బెంగళూర్ ముచ్చట్లు:
కాంగ్రెస్‌-జేడీఎస్‌లది అపవిత్ర పొత్తని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. అసెంబ్లీలో కర్ణాటక సీఎం కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కుంటోన్న నేపథ్యంలో యడ్యూరప్ప ఉద్వేగభరితంగా మాట్లాడారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్‌ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ప్రజాభీష్టానికి కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని, సీఎం సీటు కోసం కుమారస్వామి దిగజారుడు రాజకీయాలు చేశారని చెప్పుకొచ్చారు. జేడీఎస్‌కి 16 జిల్లాల్లో అసలు సీట్లే దక్కలేదని, గతంలోనూ కుమారస్వామి ఇటువంటి రాజకీయాలే చేశారని, అలాంటి జేడీఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని అన్నారు. రాజ్యాంగ ద్రోహులు మీరా? మేమా? అని ప్రశ్నించారు. కర్ణాటక శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో యడ్యూరప్ప సుదీర్ఘంగా మాట్లాడారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు అపవిత్ర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. కుమారస్వామి తీరుకి నిరసనగా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల ముందు కుమారస్వామి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 24 గంటల్లో రైతు రుణమాఫీ చేయకపోతే ఈ నెల 28న కర్ణాటక బంద్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం యడ్యూరప్ప తాము వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.
Tags: Their unclean association: Yeddyurappa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *