– సీఎం జగన్పై చంద్రబాబు విమర్శలు
Date:13/01/2021
అమరావతి ముచ్చట్లు:
కృష్ణా జిల్లా పరిటాలో నిర్వహించిన భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన ఐదు జీవోలను భోగిమంటల్లో వేశారు. అనంతరం మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్.. ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. ప్రజావేదికను కూల్చి శాడిస్టుగా వ్యవహరించారన్నారు. ఏడు వరుస విపత్తులతో రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వలేదని, అసత్యాలతో రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కోసం తాను పోరాడుతుంటే మైనింగ్ మాఫియా, బెట్టింగ్, బూతుల మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎక్కడా ఆనందంగా లేరని, రైతు కూలీలు చితికిపోయారని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అలాగే ఇసుక అందుబాటులో జనం ఇబ్బందులు పడుతున్నారని, భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండాపోయిందన్నారు.ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కొత్త విద్యుత్ మీటర్లు వ్యవసాయ మోటార్ల కాకుండా.
మంత్రులకు పెట్టాలన్నారు. ఏ మంత్రి ఎంత దోచుకున్నాడో రియల్ టైమ్లో తెలుస్తుందన్నారు. పట్టణాల్లో అన్నింటిపై పన్నులు వేస్తున్నారని, పెంపుడు జంతులపై కూడా ట్యాక్సేనన్నారు. రేపోమాపో గాలిపై కూడా పన్ను వేస్తారోమేనని ఎద్దేవా చేశారు. జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లు వేశారన్నారు. నేను ఏం తప్పు చేశానో నాకు తెలియదని, ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానన్నారు. అదే తాను చేసిన తప్పైతే క్షమించాలని కోరారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లలాంటివన్నారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాఠశాలలపై కూడా దాడులు చేసి ప్రతిపక్షాలపై నెట్టేందుకు కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతతోనే స్థానిక ఎన్నికలపై జగన్ వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags:Then kisses..now fists?