ఎప్పుడంటే అప్పుడు రేషన్ కార్డు

Sorghum on ration cards since August

Sorghum on ration cards since August

Date:17/07/2018
హైదారాబాదు ముచ్చట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రతినెలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం.లాభదాయక శాఖ కాకపోయినప్పటికి. సమాజ సేవలో ముందు ఉండే శాఖ సివిల్ సప్లై అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. సివిల్ సప్లై కార్పొరేషన్ తో పాటు నాలుగు శాఖల రాష్ట్ర, జిల్లా అధికారుల సమావేశం నిర్వహించాం. లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఎన్నో దాడులు నిర్వహించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రతి కిలో వడ్లు కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూసామని అన్నారు. 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొన్నాం. పేదలకు సివిల్ సప్లై నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నాం. కోటి ఎకరాలకు వచ్చే ధాన్యం కొని దాచే సామర్ధ్యం వుందని అన్నారు. 2.75 లక్షల మందికి మనిషికి 6 కిలోల బియ్యం అందజేస్తున్నాం. ఎప్పుడంటే అప్పుడు కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దరఖాస్తు పెట్టగానే కార్డు ఇచ్చి వెంటనే బియ్యం ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారు. కల్తీకి ఆస్కారం లేకుండా సన్న బియ్యం సరఫరా చేస్తాం. గొప్ప సంస్థగా సివిల్ సప్లై మారుతుంది. కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదంటే ఎలా పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ధరలో తేడా వచ్చినా ఉక్కుపాదం మోపుతున్నాం. 36 లక్షలు రబీలో, ఖరీఫ్ లో 5 నుంచి 6 మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చని అయన అన్నారు.
ఎప్పుడంటే అప్పుడు రేషన్ కార్డు https://www.telugumuchatlu.com/then-the-ration-card/
Tags:Then the ration card

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *