ఏపీలో కొత్తగా 13మంది జాయింట్‌ కలెక్టర్లు

Date:06/05/2020

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో మరో కీలక సంస్కరణ తీసుకువచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు 13మంది జాయింట్‌ కలెక్టర్లను నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే జిల్లాకు ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు ఉండగా, తాజా నిర్ణయంతో వారి సంఖ్య ముగ్గురికి చేరింది. అలాగే ముగ్గురు జేసీల శాఖలను బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రైతు భరోసా, రెవెన్యూ శాఖ.. గ్రామ, వార్డు, సచివాలయాల అభివృద్ధి.. ఆసరా, సంక్షేమ శాఖలకు ఒక్కోరి చొప్పున ప్రత్యేకంగా కొత్త జేసీలను నియమించింది. వీరికి మరికొన్ని శాఖలకు సంబంధించిన బాధ్యతల్ని అప్పగించింది.

 

1) రైతు భరోసా, రెవెన్యూ శాఖ జేసీ : అగ్రి కల్చర్‌, సివిల్‌ సప్లయ్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్‌, అనిమల్‌ హస్బండరీ, హార్టికల్చర్‌, ఫిషరింగ్‌, సెరీకల్చర్‌, రెవెన్యూ అండ్‌ సర్వే, నాచురల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇరిగేషన్‌, లా అండ్‌ ఆర్డర్‌, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, మై‍న్స్‌ అండ్‌ జీయోలజీ, ఎనర్జీ
2) గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీ : డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ విలేజ్‌ అండ్‌ వార్డ్‌ సెక్రటేరియట్‌ అండ్‌ విలేజ్‌ అండ్‌ వార్డ్‌ వాలంటీర్స్‌, పంచాయితీ రాజ్‌, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, స్కూల్‌ ఎడ్యూకేషన్‌, టెక్నికల్‌ ఎడ్యూకేషన్‌, హైయ్యర్‌ ఎడ్యూకేషన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, హౌసింగ్‌, మీ సేవా, ఆర్‌టీజీ అండ్‌ ఐటీఈ అండ్ సీ డిపార్ట్‌మెంట్‌, ఆల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌(ఎనర్జీ, ఇరిగేషన్‌ మినహా)
3) ఆసరా, సంక్షేమ శాఖ జేసీ : రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, ఎస్సీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్, మైనారిటీస్ వెల్ఫేర్‌, ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్‌, ఎండో మెంట్స్‌, స్కిల్‌ డెవలెప్‌ మెంట్.

ఎస్వీబీసీ సిఈవో పోస్టుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

Tags: There are 13 new joint collectors in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *