సిక్కోలులో 3 గ్రూపులు.. ఆరు వర్గాలు

శ్రీకాకుళం  ముచ్చట్లు:

మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు. ఎవరి కుంపటి వారిదే. అధిష్ఠానం మందలించినా నేతల తీరు మారడం లేదట. అదేదో సాధారణ నియోజకవర్గం కాదు. పెద్ద పొజిషన్‌లో ఉన్న సీనియర్ పొలిటీషియన్‌ సెగ్మెంట్‌ కావడంతో రచ్చ రచ్చ అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరుచోట్ల వైసీపీ పాగా వేసింది. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. ఆ ఆరు చోట్లా ఎమ్మెల్యే పేరు చెబితేనే కస్సు మంటున్నారు పార్టీ నాయకులు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ అసమ్మతి పోరు మరీ ఎక్కువగా ఉందట. ఇక్కడ నుంచి గెలిచిన తమ్మినేని సీతారాం.. స్పీకర్‌గా పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. కానీ.. సెగ్మెంట్‌లో వైసీపీని మూడు గ్రూపులు లీడ్‌ చేయడం చర్చగా మారుతోంది. ఒక గ్రూప్‌ తమ్మినేని.. మరో గ్రూప్‌ పార్టీ నేత చింతాడ రవికుమార్‌, మూడో గ్రూప్‌కు సువ్వారి గాంధీ నాయకత్వం వహిస్తున్నారట. టీడీపీ కంటే.. తమ్మినేని వర్గంపై మిగతా ఇద్దరు నేతలు చేస్తున్న విమర్శలే చాలా పదునుగా ఉంటున్నాయట. సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.తమ్మినేనితో విభేదించిన కోట బ్రదర్స్‌ వంటి ద్వితీయ శ్రేణి నాయకులను గాంధీ, రవికుమార్‌ ప్రోత్సహిస్తున్నారనే వాదన ఉంది. దీంతో ఆమదాలవలస, పొందూరు, భూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఈ ముగ్గురు నేతలకు అనుచర గణం ఉంది. పార్టీ కార్యక్రమాలను కలిసి నిర్వహించే పరిస్థితి లేదు.

 

 

 

ఇదే కాదు.. ఆమదాలవలసలో ఎవరికి వారే వైసీపీ ఆఫీసులు పెట్టేసుకున్నారు కూడా. ఆ మధ్య నిర్వహించిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీకి గాంధీ, రవి ఇద్దరూ డుమ్మా కొట్టేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్లీనరీకి మాత్రం ఇద్దరూ హాజరయ్యారు. అంతేకాదు.. తమ్మినేని కంటే ఎక్కువ మందిని జిల్లా ప్లీనరీకి తీసుకెళ్లారని పార్టీ వర్గాల్లో చర్చకు పెట్టేశారు.అసమ్మతి వర్గాన్ని తమ్మినేని ఎందుకు కలుపుకొని వెళ్లడం లేదని పార్టీ కేడర్‌ ప్రశ్నిస్తోంది. సమస్యను పెంచుకుంటున్నారే తప్ప.. పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. ఇలాగే ఉపేక్షిస్తే ఎన్నికల నాటికి అసమ్మతి ఇంకెలాంటి తీవ్ర రూపు దాల్చుతుందో అని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట. తమ్మినేని పాల్గొనే కార్యక్రమాలకు ఆ ఇద్దరూ రావడం లేదు. దాంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపైనా ఆ ప్రభావం కనిపించింది. అలా అని అసమ్మతి వర్గాలు మౌనంగా ఉండటం లేదు. వారి స్థాయిలో వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ్మినేనిపై వారే విమర్శలు చేస్తుండటంతో టీడీపీకి పెద్దగా పనిలేకుండా పోయింది. ఈ సమస్య అధిష్ఠానం దృష్టిలో ఉండటంతో వారే చికిత్స చేస్తారని ఆశిస్తున్నారు. మరి.. ఆ టైమ్‌ ఎప్పుడొస్తుందో చూడాలి.

 

Tags: There are 3 groups of sick people.. Six categories

Leave A Reply

Your email address will not be published.