Good news for the world .. Corona will be reduced to the level of the common cold!

భారత్ లో ప్రతీ 10 వేల మందికి ఎనిమిది మంది వైద్యులు

Date:15/06/2020

 

ఢిల్లీ ముచ్చట్లు:

 

కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తితో దేశంలో ఉన్న లోపాలు సమస్యలు బయటపడుతున్నాయి. ఏ రంగానికి అధిక ప్రాధాన్యమివ్వాలో వైరస్ వ్యాప్తితో ప్రభుత్వాలకు తెలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ నివేదిక విడుదల అయ్యింది. ఆ నివేదిక భారతీయులను ఆందోళన కలిగించే రీతిలో ఉంది. అదేమిటంటే.. భారత్ లో ప్రతీ 10 వేల మందికి ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే వైద్యులు ఉన్నారని తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తెలిపింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల పరిస్థితిని విశ్లేషిస్తూ భారత్లో ఉనషన పరిస్థితిపైన కూడా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. భారతదేశంలో మూడు నెలల లాక్డౌన్ సడలింపుల తరువాత కేసులు మరింతగా పెరుగుతున్నాయని పేర్కొంది. మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ రాష్ట్రాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని గుర్తు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభావిత ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

 

మున్ముందు వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలున్నాయని తేల్చిచెప్పింది. అయితే దీనికి ప్రధాన కారణాన్ని వివరించింది.లాక్డౌన్ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వైఫల్యం జరిగిందని స్పష్టం చేసింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేదని ల్యాన్సెట్ ఆరోపించింది. వైద్య ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన పునర్నిర్మాణం జరగలేదని వివరించింది. వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం జరగలేదని ఇప్పటికైనా దృష్టిసారించాలని నివేదికలో కోరింది. రాబోయే నెలల్లో వైరస్ను అంతం చేయడానికి ఇది కీలకమని ల్యాన్సెట్ గుర్తు చేసింది. అమెరికా బ్రెజిల్తోపాటు భారతదేశంలోనూ జూన్ 26 నుంచి జూలై 3వ తేదీ వరకు లక్ష కన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడాన్ని ల్యాన్సెట్ ప్రస్తావించింది.

 

మళ్లీ ఆగిన మల్లన్న సాగర్ పనులు

 

Tags:There are eight doctors for every 10,000 people in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *