బీజేపీలో చేరికలు వుంటాయి
-జడ్చర్ల లో ఈటల పర్యటన
జడ్చర్ల ముచ్చట్లు:
జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నాడు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ జెండా ఎగురవేసి.. జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ఈటల కు ఖడ్గం బహూకరించారు. పలువురికి ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పి బీజేపీ లోకి స్వాగతం పలికారు.ఈటెలరాజేందర్ మాట్లాడుతూ దేశ ప్రజాజనికానికి శుభదినం. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఒక ఆదివాసీ మహిళ ను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి అణగారిన వర్గాల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో నరేంద్ర మోదీ నిరూపించుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం పాటించారు. 70 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారికి స్థానం కల్పించారు. అందుకే దేశ వ్యాప్తంగా బీజేపీ కి ఆదరణ పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తా అని కెసిఆర్ మాట తప్పారు. అనేక అంశాలు మానిఫెస్టో లో రాసుకొని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్. ప్రభుత్వ హామీలు, వైఫల్యాల ను ఎండగట్టేందుకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నేను దేవరకద్ర వెళ్తున్నా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మా ఆక్షన్ ప్లాన్ ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగరేది బీజేపీ జెండానే. ఇప్పుడు రోజులు బాగా లేవు. 27 తరువాత బీజేపీ లో చేరికలు ఉంటాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారు. సీఎం మీద పోటీచేసుడే.. ఒడించుడేనని అన్నారు.

దుర్మార్గ పాలన అంతం కావాలి అంటే.. ఎవరో ఒకరు కెసిఆర్ ను కొట్టాలి కదా. గజ్వేల్ లో నాకు తప్పకుండా ఆదరణ ఉంటుంది. కెసిఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మద్య పంచాయితీ. ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ ఎవరు కూడా కెసిఆర్ ను గుండెల్లో పెట్టుకొనే వారు లేరు. అందరి అభిమానాన్ని కోల్పోయారు. కాంగ్రెస్ ఢిల్లీ లో రాదు ఇక్కడ ఎదగదు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే టీఆర్ఎస్ కి ఓటు వేసినట్టే. రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరినా వారిని ముందు ఉండి వాళ్ళను గెలిపిస్త. హుజురాబాద్ ఫార్ములా ప్రకారం పనిచేస్తాము. తిరుపతి కొండమీద కాంగ్రెస్ కి కెసిఆర్ ను ఎదుర్కొనే సత్తా లేదు అని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఆయన కెసిఆర్ మీద కసి తీర్చుకోవాలని చూస్తున్నారు. ఆ వేదిక బీజేపీ మాత్రమే అని ఆయన్ను ఆహ్వానిస్తున్నాముని ఈటల అన్నారు.
Tags: There are inclusions in BJP
