భీమిలీలోనే భూ బకాసురులున్నారు : జగన్

There are land holders in Bhimili: Jagan

There are land holders in Bhimili: Jagan

Date:15/09/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ భూ కుంభకోణంలో సిట్‌ గుర్తించిన భూ కబ్జాలు, అక్రమాల్లో అధిక శాతం ఈ నియోజకవర్గ పరిధిలోనివేనని వైసీపీ అధినేత జగన్ అన్నారు.  సిట్‌ దర్యాప్తులో సుమారు 10వేల ఎకరాల భూముల కబ్జాలు లిటిగేషన్లలో ఉంటే వాటిలో సగానికి పైగా భీమిలిలోనే జరిగాయని నిర్ధారించారని…మరిపై వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని జగన్ ప్రశ్నించారు.
ప్రజాసంకల్పయాత్ర శనివారం భీమిలిలోకి అడుగుపెట్టింది. ప్రజాకంటక పాలనను అంతమొం దించే లక్ష్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ఈ యాత్రకు.. భారీగా స్వాగతం పలికారు.ఏ స్థాయిలో ఇక్కడ భూములను కబళించారో వేరే చెప్ప నవసరం లేదు.
ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి సాగర తీరంలో సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘించి తన కలల సౌధాన్ని నిర్మించడమే కాకుండా తన బంధువుకు చెందిన ప్రత్యూష కంపెనీ కోసం ఆందపురం, భీమిలి మండలాల్లో తప్పుడు రికార్డులు పుట్టించి ప్రభుత్వ భూములనే రూ.200 కోట్లకు బ్యాంకుల్లో తనఖా పెట్టడం కలకలం రేపిందన్నారు.
అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, అతని కుటుంబ సభ్యులపై ఏకంగా 90 ఎకరాల దేవాదాయ భూములను కాజేశారని సిట్‌ సిఫార్సుతో తేలిందని గుర్తు చేశారు. ఇవే కాదు.. గత నాలుగున్నరేళ్లలో టీడీపీ నాయకుల భూదందాలు ఎంత చెప్పుకున్నా తక్కువే..బకాసురుడిని సంహరించిన భీముని పేరుతో ఏర్పడిన భీమునిపట్నం కేంద్రంగా ఏర్పడిన భీమిలి నియోజకవర్గం నేడు బకాసురుడినే మించిన భూ బకాసురుల చెరలో చిక్కి శల్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ హయాంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిన ఈ నియోజకవర్గం నేడు భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు.
Tags:There are land holders in Bhimili: Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *