సూళ్లూరుపేట ముచ్చట్లు:
సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విభేదాల చిచ్చు రగులుతూనే ఉంది. సుళ్లూరుపేట టిడిపి టికెట్ నెలవల విజయశ్రీకి ప్రకటించడంతో ఈ విభేదాలకు కారణంగా మారింది. ఇందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పరస వెంకటరత్నయ్య కుమార్తె పరసా షాలిని సోమవారం నాయుడుపేటలో ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని విమర్శించింది.. అదేవిధంగా వేనాటి రామచంద్రారెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి కూడా నియోజకవర్గ అభ్యర్థిత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. నెలల విజయశ్రీ టికెట్ ఖరారు చేస్తే వేనాటి వర్గం వారు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనికి Saty వెంకటరత్నయ్య కూడా వంత పాడుతున్నారని తెలుస్తోంది.
Tags:There are many differences in TDP…