శ్రీ దేవి మరణం వెనుక అనేక రహస్యాలు

There are many mysteries behind the death of Shri Devi

There are many mysteries behind the death of Shri Devi

Date:26/02/2018
దుబాయ్ ముచ్చట్లు:
అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఉండకపోతే…. బోని కపూర్ సర్ ప్రైజ్ చేద్దామనుకంటున్నారట… అయితే… వాష్ రూమ్ లోకి వెళ్లిన శ్రీదేవి… అందర్ని సర్ ప్రూజ్ చేసిందంటూ…బోని కపూర్ వాపోతున్నారు. శ్రీదేవి హఠాన్మరణానికి ముందు భర్త బోనీ కపూర్ ఆమెను ‘సర్‌ప్రైజ్’ చేద్దామనుకున్నాడట. అయితే శ్రీదేవి మాత్రం భర్తతోపాటు అశేష ప్రేక్షకాభిమానులకు ‘సర్‌ప్రైజ్’ ఇస్తూ కానరాని లోకాలకు తరలిపోయింది.మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ చేరుకున్న శ్రీదేవి దంపతులు అక్కడి జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేశారు. ఆ రాత్రికి శ్రీదేవికి అద్భుతమైన డిన్నర్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామని భర్త బోనీ భావించాడట. ఈ విషయం ఆమెకు ముందే చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు. డిన్నర్‌కు ముందు నిద్రపోతున్న శ్రీదేవి లేపి 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.ఆ తర్వాత రెడీ అయేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లిన శ్రీదేవి పావుగంటైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బోనీకపూర్ వాష్‌రూమ్ వద్దకు వెళ్లి తలుపు కొట్టారు. లోపలి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బలవంతంగా డోర్ తెరిచారు. లోపల శ్రీదేవి బాత్‌టబ్‌లో అచేతనంగా పడి ఉండడంతో లేపడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే స్నేహితులను పిలిచారు. 9 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు, పోలీసులు వచ్చే లోపే శ్రీదేవి తుదిశ్వాస విడిచినట్టు బోనీ కుటుంబ సన్నిహితుల ద్వారా తెలిసింది.మరో వైపు అతిలోక సుందరి శ్రీదేవి  తన హోటల్‌ గదిలో శ్రీదేవి స్పృహ కోల్పోయి కనపడిందని, ఆమెను వెంటనే దుబాయ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. శ్రీదేవికి ఎలాంటి హృద్రోగ సమస్యలు లేవని సంజయ్ కుమార్ అన్నారు. ఒక్కసారిగా గుండెపోటు ఎలా వచ్చిందో తెలియడం లేదని, ఆమె మృతి చెందిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.
Tags; There are many mysteries behind the death of Shri Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *