ప్రక్షాళనలు వుంటాయి

వైకాపా శాసనసభా పక్ష భేటీలో జగన్

 

Date:25/05/2019

 

గుంటూరు ముచ్చట్లు:

ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాం. 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశాం. అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనమని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైసిపి క్యాపు కార్యాలయంలో జరగిన వైకాపా శాసనసభా పక్ష సమావేశంలో అయన మాట్లాడారు. జగన్ మాట్లాడుతూ ఈ విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23, ఎంపీలు ముగ్గురు ఇప్పుడు టీడీపీకి మిగిలింది. చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23. దేవుడు చాలా గొప్పగా ఈ స్క్రిప్ట్ రాశాడని అన్నారు.  మన టార్గెట్ 2024 – 2024లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పెర్ఫార్మెన్స్ చూసి ప్రజలు 2024లో మనకు ఓటెయ్యాలని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తా. మామూలుగా ఉండదు ఆ ప్రక్షాళన అని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన చేస్తా.  ఆ ప్రక్షాళనకు మీ అందరి సహాయసహకారాలు కావాలి, అందించాలి . మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా.  త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయ్. వాటిని కూడా క్లీన్స్వీప్ చేయాలి. ఈ విజయానికి కారణం నాతోపాటు మీ అందరూ అని అన్నారు. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారు. 2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలని అయన అన్నారు. ఈ భేటీలో జగన్ ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

 

 

పారిశుధ్య  కార్మికుల నిరసన

Tags: There are purges

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *