There are reserves of gas cylinders

 గ్యాస్ సిలిండర్ల నిల్వలున్నాయి

Date::03/04/2020

రంగారెడ్డి ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లాలో ఎల్.పీ.జీ గ్యాస్ సిలిండర్ల స్టాక్ సరిపడా నిల్వ ఉన్నందున, ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఏవిధమైన ఆందోళన చెందవలసిన పనిలేదని, అనవసర భయంతో, అవసరం లేకున్నా కొనుగోలు చేయవద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి ఇప్పిలి రమ తెలిపారు.  జిల్లాలో ఎల్.పీ.జీ వినియోగదారులు భయం తో బుకింగ్ చేయవద్దని, రీఫిల్స్ లకై స్థానిక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల షోరూం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా వినియోగదారులు కరెన్సీ నోట్లను ఇవ్వడానికి బదులుగా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత నివ్వాలని ఆమె సూచించారు. జిల్లాలోని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు వచ్చే మూడునెలలు మూడు సిలిండర్లను  ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున, ఒక్కొక్క వినియోగదారుడికి నెలకు ఒక్క సిలిండర్  మాత్రమే ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు. ఒక సిలిండర్ పొందిన అనంతరం 15 రోజుల తర్వాతనే మరో సిలిండరుకై బుక్ చేసుకోవాలని తెలియచేసారు.

నెల్లూరులో అత్యధిక కరోనా కేసులు నమోదు.

Tags:There are reserves of gas cylinders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *