Natyam ad

నూటికో..కోటికోక్కరు ఉంటారు

సమాజ హితంలో రాజయ్య దంపతులను చూసి చాలా నేర్చుకోవాలి..

– భూదేవి అంత ఓర్పు.. భూలక్ష్మి లోనే కనిపించింది…


–  అనాధలను కడుపులో పెట్టుకొని పెంచుతున్న గొప్ప దంపతులు…

Post Midle

– ఆశ్రమ నిర్వాహకులను సత్కరించిన బిఆర్ ఎస్ నాయకులు దేవి లక్ష్మీ నరసయ్య…

కమాన్ పూర్ ముచ్చట్లు:

బంధాలకు… బంధుత్వాలకు దూరంగా… స్వార్థాలకు.. ఆర్థిక ప్రయోజనాలకు దగ్గరగా బతుకుతున్న నేటి ఆధునిక ప్రపంచములో.. పోచంపల్లి రాజయ్య- భూలక్ష్మి లాంటి పుణ్య దంపతులు నూటికో..కోటికో ఒక్కరు ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదని బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు దేవి లక్ష్మి నర్సయ్య అన్నారు. గోదావరిఖని గాంధీ నగర్ లో గల ఎం డి హెచ్ డబ్ల్యు ఎస్అనాధ పిల్లల సంరక్షణ కేంద్ర వ్యవస్థాపకులు పోచంపల్లి భూలక్ష్మి – రాజయ్య దంపతుల 27వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం రాత్రి ఆశ్రమం సందర్శించిన ఆయన.. రాజయ్య దంపతుల తో కేకు కట్ చేయించి  శాలువా తో ఘనంగా సత్కరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మనలో చాలామంది ఏదైనా శుభ కార్యాలు ఉంటే..

 

 

 

సామాజిక సేవా దృక్పథంతో  అనాధ పిల్లల మధ్య వేడుకగా చేసుకొని… వారికి ఒక పూట అన్నం పెట్టడం  చూస్తున్నామని.. కానీ రాజయ్య దంపతులు వారి దైనందిన  జీవితంలో  వారి గురించి మరిచి.. ఎంతసేపు అనాధ పిల్లల కోసమే ఆలోచించి..వారికి గొప్ప భవిష్యత్తు అందిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మ ప్రేమ, నాన్న అనురాగానికి నోచుకోలేదు ఎంతోమంది అనాధ చిన్నారులను చేరదీసి… పేగు బంధం కాకపోయినా అంతకంటే ఎక్కువగా భావించి అన్నితామై సాకుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేయడమే కష్టతరం అవుతున్న ఈ రోజుల్లో ఇంతమంది చిన్నారులను అక్కున చేర్చుకొని అమ్మ ఒడిలా ఆదరిస్తున్న గొప్ప దంపతులని అభినందించారు. విధి వంచితులైన అనాధ పిల్లలకు అమ్మ నాన్నలుగా కొత్త జీవితాలను ప్రసాదిస్తున్న ఈ దంపతులు దైవదూతలని కొనియాడారు

 

 

 

ఈ దంపతులకు ఆ భగవంతుడు  ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం ఆశ్రమ పిల్లలు కలిసి రాజయ్య దంపతులచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. నిజంగా అమ్మ నాన్నలు ఉంటే కూడా మమ్మల్ని ఇంతగా చూసుకుంటారో లేదోనని భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ఆశ్రమ పిల్లలు స్థానికులు పాల్గొన్నారు..
Tags;There are tens of millions

Post Midle