కాల్ గర్ల్స్ పేరిట వల రెండున్న లక్షలు హంఫట్
నందిగామ ముచ్చట్లు:
కాల్ గర్ల్స్ నుపంపుతాననని ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతూ బాంక్ అకౌంట్లలో డబ్బులు కాజేస్తున్న రాజస్తాన్ కు చెందిన జీవన్ కుమార్ అనే ఆన్ లైన్ మోసగాణ్ణి నందిగామ పోలీసేలే అరెస్టు చేసి అతని వద్ద రు 1,80,000 నగదు రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.
నందిగామ ఎ.సి.పి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అల్ట్రాటెక్ సిమెంటు ఫ్యాక్టరీ లో మేనేజర్ గా పనిచేస్తున్న సంజయ్ కు గత యేడాది డిసెంబర్ నెలలో ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేసి అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి వీరిని పంపుతానని కొంత మొత్తం అడ్వాన్స్ పంపాలని కోరాడు. తాను ఫోన్ పే చే స్తానని చెప్పగా తనకు ఫోన్ పే లేదని కార్డు నెంబరు చెప్పమని కోరగా తానుకార్డు నెంబరు చెప్పగా ముద్దాయి జీవన్ కుమారు అతని కార్డు హాక్ చేసి ఒటిపి పంపి ఒటిపి ద్వారా మూడు దఫాలుగా రు2,45,000 లు డ్రా చేసుకున్నాడని సంజయ్ తాను మోసపోయానని తెలుసుకొని చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా చిల్లకల్లు ఎస్.ఐ చిన్నబాబు టీమ్ రాజస్థాన్ కు వెళ్లి ముద్దాయిని అరెస్టు చేశారని అన్నారు.
Tags: There are two lakhs in the name of call girls