జిల్లాలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం

కడప ముచ్చట్లు:

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు. వందరోజుల కార్యాచరరణ ప్రణాళిక తో గంజాయి కట్టడికి శ్రీకారం. ప్రజలు పోలీసు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 14500 ద్వారా పోలీస్ శాఖకు సమాచారమివ్వాలి.జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ వెల్లడి.కడప  జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై కొరడా ఝుళిపించేందుకు వందరోజుల కార్యాచరణ ప్రణాళికతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ తెలిపారు.ప్రణాళికలో భాగంగా  జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్నవారిని మళ్ళీ నేరాలకు పాల్పడకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పదే పదే గంజాయి నేరాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవడంతో పాటు పి.డి యాక్ట్ ప్రయోగించడం జరుగుతుందని ఎస్.పి గారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నాకాబందీ నిర్వహించి అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల ద్వారా కలిగే అనర్ధాలపై కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు గంజాయికి సంబంధించిన సమాచారాన్ని 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్.పి గారు సూచించారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందని ఎస్.పి గారు తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యత గా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. గంజాయి సేవించే వ్యసనానికి బానిసగా మారిన వారి సమాచారమిస్తే వారిని రిమ్స్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల లోని డీ అడిక్షన్ కేంద్రానికి తరలించి తిరిగి వారిని సమాజంలో సాధారణ వ్యక్తుల్లా మార్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు వివరించారు.

 

 

 

Tags:There is a crackdown on the sale and illegal transportation of ganja in the district

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *